ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల అంశంపై హైకోర్టులో వాదనలు ముగిసాయి. వాదనలు అంతరం తీర్పును హైకోర్ట్ రిజర్వ్ లో ఉంచింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 623ను సవాలు చేస్తూ పిటిషనర్ పిటిషన్ ను దాఖలు చేశారు. జీవో నంబర్ 623 ప్రకారం పంచాయితీ కార్యాలయాలకి రంగులు వేయాలని ఏపీ సర్కారు పేర్కొంది. భవనాలపై వైసీపీ జెండా రంగులే కనిపిస్తున్నాయని పిటిషనర్ తరుపు న్యాయవాది సోమయాజులు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది.