ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ కు ఊరట లభించింది. ఆయనపై జగన్ సర్కార్ పెట్టిన కేసు ఆక్రమమంటూ ఏపీ హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు కేసును హైకోర్టు కొట్టి వేసింది.
ఈడీబీ సీఈవోగా కృష్ణ కిషోర్ ఎక్కడా అవకతవకలకు పాల్పడలేదన్న హైకోర్టు వెల్లడించింది. రాష్ట్రంలో 2019లో వైసీపీ సర్కార్ ఏర్పడ్డాక రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న కృష్ణ కిషోర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఆ తర్వాత ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సస్పెన్షన్ అంశంపై కేంద్ర పరిపాలనా ట్రబ్యునల్ ను కృష్ణ కిషోర్ ఆశ్రయించారు. దీంతో ఆ ఉత్తర్వులపై క్యాట్ స్టే ఇచ్చింది.
ఆ తర్వాత దానిపై జస్టిస్ నరసింహారెడ్డి బెంచ్ విచారణ జరిపింది. ఆ సస్పెన్షన్ ఉత్తర్వులు చెల్లవంటూ క్యాట్ హైదరాబాద్ పేర్కొంది. అనంతరం దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
కృష్ణ కిషోర్ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నట్టుగా గానీ, వ్యక్తిగతంగా లాభ పడ్డట్టు గానీ ఆధారాలు లేవని పేర్కొంది. ఆయనపై పెట్టిన సెక్షన్లు చెల్లవంటూ కేసును కొట్టివేసింది.