ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం కేసును 19వ తేదీకి వాయిదా వేసింది.
ఇదే అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయటంతో… సుప్రీంలో విచారణ ఉన్నందున హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను యధావిధిగా నిర్వహించాలని, కరోనో బూచీ పేరుతో వాయిదా వేశారని… అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సమాచారం కూడా తీసుకోలేదని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.
ఇదే అంశంపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రమేష్ కుమార్‌పై గవర్నర్‌కు ఏపీ సీఎం జగన్ ఫిర్యాదు చేయగా…. రమేష్ కుమార్ కూడా గవర్నర్‌ను కలిసివచ్చారు.