ఏపీలో సంచలనం రేపిన డాక్టర్ సుధాకర్ బాబు ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది. సుధాకర్ బాబు వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు విశాఖ సెషన్ జడ్జి ప్రత్యక్షంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు కోరింది. సుధాకర్ బాబుతో మాట్లాడి జ్యూడిషియల్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ఇక ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన ఆఫిడవిట్, వీడియోలను పిటిషనర్ కు ఇవ్వాలని హైకోర్టు కోర్టు సూచించింది. విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
హైకోర్టు ఆదేశాలతో మానసిక వికలాంగుల వైద్యశాలలో ఉన్న సుధాకర్ బాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ సెషన్స్ కోర్టు జడ్జి విచారించారు.
కరోనా వైరస్ బాధితులకు వైద్యం చేసే డాక్టర్లకు సరిపడ పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్కులు కూడా లేవంటూ సుధాకర్ బాబు వ్యాఖ్యానించటంపై ఏపీ సర్కార్ ఆయన్ని సస్పెండ్ ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఆ తర్వాతత విశాఖపట్నంలో ఆయన్ను అర్ధనగ్నంగగా నడి రోడ్డుపై కొట్టడాన్ని వైద్య సంఘాలు, పలువురు ఖండించారు. కనీసం సుధాకర్ బాబు తల్లికి కూడా చూసేందుకు అనుమతి ఇవ్వకుండా…. మెంటల్ కండీషన్ సరిగ్గా లేదంటూ మానసిక వైద్యారోగ్యశాలకు తరలించారు.