మూడు రాజధానులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ పై విధించిన స్టేటస్ కోను ఈ నెల 27వరకు హైకోర్టు పొడిగించింది. మొదట ఈరోజు (ఆగస్టు 14)వరకు స్టేటస్ కో ఉండగా, మరోసారి విచారించిన న్యాయస్థానం స్టేటస్ కోను పొడిగించింది.
దాదాపు 50మంది అమరావతి రైతులు, వివిధ వేదికలు మూడు రాజధానులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ను సవాలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసలు జారీ చేసి, స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఈనెల 16నే ఎగ్జిక్యూటివ్ రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించాలన్న ఉద్దేశంతో హైకోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంలో ఈ పిటిషన్ ఇంకా విచారణకు రాకపోవటంతో అర్జెంట్ గా విచారించాలని కోరినా సుప్రీంలో ఇంకా విచారణకు రాలేదు. దీంతో ప్రభుత్వం 16న నిర్ణయించుకున్న ముహుర్తాన్ని రద్దు చేసుకుంది.