ఏపీ హైకోర్టులో గురువారం నాలుగు కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది. వైఎస్ వివేకానంద హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కూతురు సునీత , సీఎం జగన్, టీడీపీ నేత ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం కీలక విచారణ జరగనుంది.
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారనే అంశంలో సీఐడీ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే సీఐడీ ఈ కేసులో ఆధారాలను సేకరించింది. కోర్టులో ఆధారాలు సమర్పించిన అతని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.
Advertisements
ఏపీలోని గ్రామ పంచాయితీ కార్యాలయలకు అధికార పార్టీ జెండా రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై కూడా హైకోర్టు విచారణ జరపనుంది.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల జీవో 176ను నిలిపివేయాలంటూ దాఖలు అయినా పిటిషన్ పై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. 50శాతానికి మించి రిజర్వేషన్ల అమలుపై సుప్రీం అభ్యంతరం తెలపడంతో… 50 శాతానికే రిజర్వేషన్లను పరిమితం చేయాలా, ఏ సమయంలో ఎన్నికలను నిర్వహించాలానే అంశాలపై తీర్పు ఇవ్వనుంది హైకోర్టు.