ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యే లకు ఏపీ హై కోర్టు నోటీసులు ఇచ్చింది. లాక్ డౌన్ సమయం లో నిబంధనలు అతిక్రమించి వ్యవహరించారన్న పిటిషన్ పై హైకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ లకు కోర్ట్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే లపై తీసుకున్నా చర్యల వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రబుత్వానికి, డిజిపి కి ఆదేశాలు జారీ చేసింది.