కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టు న్యాయవాది వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య జిల్లాలో కలకలం రేపుతోంది. నగర శివారులోని సఫా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మృత దేహాన్ని గుర్తించిన పోలీసులు.. నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేసి రోడ్డు పక్కన పాడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నెల 7న వెంకటేశ్వర్లు కనిపించకుండా పోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే.. చింతకుంటలోని తన తమ్ముని వద్దకు వెళ్లి వస్తానని వెళ్లిన వెంకటేశ్వర్లు.. కనిపించకుండా పోయారని మహానంది పీఎస్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు.
కాగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. నగరంలోని టెలికం నగర్ లో నివాసం ఉంటున్న బాధితుడు.. రియల్ ఎస్టేట్ వివాదాల్లో ఎక్కువగా వకాలత్ తీసుకొని కోర్టులో వాదించేవాడని పేర్కొన్నారు.
భూ వివాదాలకు సంబంధించిన కేసులో తమకు అడ్డం వస్తున్నారని.. ఆయనను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన వాదిస్తున్న కేసుల ఆదారంగా దర్యాప్తు చేస్తున్నట్టు స్పష్టం చేశారు పోలీసులు.