ఏపీ లో మద్యం అమ్మకాలపై హైకోర్టులో విచారణ ముగిసింది. మద్యం అమ్మకాల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ప్రస్తుతం ఉంది కాబట్టి సుప్రీం తీర్పు వచ్చే వరకు విచారణ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్ట్ కు విజ్ఞప్తి చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మద్యం దుకాణాలు తెరవటంతో వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని, మద్యం షాప్ ల వద్ద కనీస దూరం పాటించకుండా ఒకరిని ఒకరు తాకుతూ కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారని కాబట్టి మద్యం అమ్మకాలను వెంటనే నిలిపి వెయ్యాలని సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే.