పంచాయితీరాజ్ మంత్రిగా ఎన్నికలు సజావుగా చూడాల్సిన బాధ్యత ఉన్న పెద్దిరెడ్డి… తనే స్వయంగా ఎన్నికల అధికారులను బెదిరించేలా మాట్లాడారని ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. మంత్రి పెద్దిరెడ్డిని హౌజ్ అరెస్ట్ చేయాలని, ఈ నెల 21వరకు తను మీడియాతో కూడా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.
దీనిపై వైసీపీ, ప్రభుత్వ పెద్దలు సీరియస్ అయ్యారు. ఒక వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే హక్కు ఎన్నికల సంఘానికి లేదని… పైగా తను మంత్రి అంటూ మండిపడ్డారు. ఇటు ప్రభుత్వం కూడా ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించింది.
మంత్రి పెద్దిరెడ్డిని హౌజ్ అరెస్ట్ చేయాలన్న ఆదేశాలను కొట్టివేయగా… ఎస్ఈసీ ఆదేశాలకు అనుగుణంగా మీడియాతో మాట్లాడకుండా నిషేధం విధించింది.