ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో సారి చుక్కెదురు అయింది. కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీస్ కార్యాలయాలకు… జీవోను సస్పెండ్ చేయాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.