కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా విద్యాశాఖ అధికారులకు జైలు శిక్షను రద్దు చేసింది ఏపీ హైకోర్టు. ఏపీకి చెందిన ఇద్దరు విద్యాశాఖ అధికారులకు హైకోర్టు విధించిన జైలు శిక్షను ధర్మాసనం సవరించింది.
కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణకు నెల రోజుల పాటు జైలు శిక్ష, రెండు వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు మొదట తీర్పు ఇచ్చింది.
అయితే ఆ ఇద్దరు అధికారులు హైకోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పడంతో జైలు శిక్షను రద్దు చేసింది. బదులుగా సాయంత్రం వరకు కోర్టులోనే నిలబడాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయని నేపథ్యంలో శిక్ష విధిస్తున్నట్లు స్పష్టం చేసింది ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు.