ఏపీ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 35 ను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. పాత విధానంలో టికెట్ ధరలు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా టికెట్ ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని.. సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచుకునే అవకాశం థియేటర్లకు ఉందని.. థియేటర్ల యాజమాన్యాల తరుపు వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.
జీవో నెం. 35ను రద్దు చేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను ఏరియాను బట్టి నిర్ణయిస్తూ ఓ జీవోను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీలో పెద్ద చర్చే జరిగింది.