తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. నిబంధనలకు విరుద్దంగా ఈ ఆహ్వానితుల జాబితా తయారు చేశారని, ఆ జీవోను కొట్టివేయాలని పిటిషనర్ కోర్టును కోరగా, పిటిషనర్ వాదనతో కోర్టు ఏకీభవించింది.
ఇటీవల తిరుమల తిరుపతి బోర్డుకు 24మందితో పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, బ్రహ్మణ కార్పోరేషన్ చైర్మన్ సుధాకర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, గతంలో ఎప్పుడూ లేనంతగా 50మందిని ప్రత్యేక ఆహ్వానితులను ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు ఈ జీవోను కోర్టు సస్పెండ్ చేసింది.