ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు విడుతలుగా మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మార్చి 3వ తేదీలోపు పంచాయితీ ఎన్నికలను, ఫిబ్రవరి 15లోపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది.
జనవరి 17న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని, పంచాయితీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటీఫికేషన్ జారీ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.