జులై ఆఖరు నుండి సెట్ల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జులై 27 నుండి 31 వరకు ఎంసెట్ నిర్వహించబోతుంది. జులై 24న ఈసెట్ ఉండబోతుంది. జులై 25న ఐసెట్ పరీక్షలు జరగబోతున్నాయి.
ఇక ఆగస్ట్ 2 నుండి పీజీ సెట్, ఆగస్ట్ 6న లాసెట్ నిర్వహించబోతుంది. ఆగస్ట్ 5న ఎడ్ సెట్, ఆగస్ట్ 7-9వరకు పీఈ సెట్ నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి పరీక్షల తేదీలను ప్రకటించింది.
ఇక వీటితో పాటు పదవ తరగతి పరీక్షల నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు విద్యాశాఖ మంత్రి. సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దని, లాక్ డౌన్ ఎత్తివేశాక పిల్లలందరికీ సమయమిచ్చే పరీక్షలు పెడతామని హమీ ఇచ్చారు.