ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్లపై హోంశాఖ ముఖ్య కార్యదర్శి క్లారిటీ ఇచ్చారు. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుకు సంబంధించిన జీవో 35 అమల్లోనే ఉందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. జీవో 35 పై హైకోర్టు తీర్పు పిటిషనర్ లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. మొత్తం మూడు పిటిషన్లు హైకోర్టులో వేర్వేరుగా దాఖలు కాగా వాటన్నింటిపై ఒకే సారి విచారణ జరిగింది.
ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లా లోని 225 థియేటర్లకు తీర్పు వర్తింపు ఉంటుందని హోం శాఖ తెలిపింది. మిగిలిన థియేటర్లకు జీవో 35 అమలులో ఉంటుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి క్లారిటీ ఇచ్చారు.