ఏపీ కేడర్‌కు చెందిన మరో ఐఏఎస్ అధికారికి కోర్టు ధిక్కరణలో 3 నెలల జైలు శిక్ష ఖరారైంది. ఈ మేరకు ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేసిన ఐఏఎస్ అధికారి నారాయణకు 3 నెలల జైలు శిక్షను విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.

అయితే.. విశాఖ నగరంలో వీధి వ్యాపారులకు సంబంధించి కోర్టు కొన్ని ఉత్తర్వులను జారీ చేసింది. వాటిని అమలు చేసే బాధ్యతను నారయణకు అప్పగించింది కోర్టు. అయితే.. వాటిని అమలు చేయని కారణంగా హరి నారాయణకు శిక్ష విధించింది.
అయితే.. ఈ శిక్ష అమలును 6 వారాలు వాయిదా వేస్తూ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. నిందితుడు విస్తృత ధర్మాసనంలో తీర్పును సవాల్ చేసుకునేందుకే ఈ వెసులుబాటు ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది.
విస్తృత ధర్మాసనంలో కూడా ఈ తీర్పుపై స్టే విధించకపోతే.. జూన్ 16న హరి నారాయణ స్వయంగా హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.