రాజధాని అంశం పై అధికార, ప్రతిపక్ష పార్టీలు మంకు పట్టు వీడడంలేదు. ఈ కారణంగా అమరావతి రాజధానికి వ్యవసాయ భూములు అప్పగించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారడంతో పాటు ఎనిమిది సంవత్సరాలు రాజధాని అంశం మాత్రం విభజనాంధ్రప్రదేశ్ లో చర్చోపచర్చలు జరుగుతునే ఉన్నాయి. మూడు రాజధానుల అంశం పై మూడేళ్లుగా రచ్చ నడుస్తోంది.
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ…ఈ రాజధాని అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ ముందుకెళుతున్నాయి. రాష్ట్రం విడిపోయాక అప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ప్రకటించేశారు.ఏదో మొక్కుబడిగా అప్పుడు జగన్ మద్ధతు ఇచ్చారు. ఇక చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. గ్రాఫిక్స్‌లు చేసి జనాలని మురిపించారు. ఇక అక్కడ టీడీపీ లెక్కలేనంత అవినీతి, అక్రమాలకు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తూ…అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చింది.
అమరావతికి ముంపు ఉందని, ఖర్చు ఎక్కువని, అదే అన్నీ రెడీగా ఉన్న విశాఖ అయితే రాజధానిగా బాగుంటుందని జగన్..ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించారు. అయితే మూడు రాజధానులు చెప్పి మూడేళ్లు అయింది.కానీ ఇంతవరకు దారి దిక్కు లేదు. పైగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా కేసులు పడటంతో మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకున్నారు. మళ్ళీ కొత్త బిల్లుతో వస్తామని చెప్పారు. ఎలాగైనా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ చెబుతోంది.
టీడీపీ ఒకే రాజధాని ఉంటుందని, అది అమరావతి అంటుంది…అటు అమరావతి రైతులు మళ్ళీ పోరాటం మొదలుపెట్టారు. అమరావతి నుంచి శ్రీకాకుళంలోని అరసవల్లి వరకు పాదయాత్ర సిద్దమయ్యారు..కానీ దీనికి డీజీపీ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో రైతులు హైకోర్టుకు వెళ్లి 600 మంది పాదయాత్రకు అనుమతి పొందారు. ఇలా రాజధాని విషయంలో ఎప్పుడు ఏదొక రగడ నడుస్తూనే ఉంది…దీని వల్ల రాజకీయ పార్టీలకు రాజకీయ లబ్ది వస్తుందేమో గాని…చివరికి నష్టపోయేది మాత్రం ప్రజలే. ఇప్పటికే బయట రాష్ట్రం వాళ్ళు..మీ రాజధాని ఏది అంటే ఏపీ ప్రజలు సమాధానం చెప్పలేని పరిస్తితిలో ఉన్నారు. అలాంటి పరిస్తితుల్లో ఏపీ ఉంది.