ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ నామినేషన్ల పర్వం మొదలుకానుంది. 12 జిల్లాల్లోని 3,249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు నేటి నుంచి నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 31వ తేదీ వరకు నామినేషన్లకు ఆఖరు తేదీకాగా, ఆ మరుసటి రోజు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు అవకాశమిస్తారు. ఫిబ్రవరి 4న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు.
9న మొదటి దశ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా విజయనగరం జిల్లాలో మొదటి దశలో ఎన్నికలు జరుగవు. రెండో దశ ఎన్నికలు ఫిబ్రవరి 13న, మూడో విడత ఎన్నికలు ఫిబ్రవరి 17న నిర్వహించనున్నారు.