ఏపీలో రాజకీయాలు వాడి-వేడిగా ఉంటాయి. సవాళ్లు-ప్రతి సవాళ్లతో పాటు ఆరోపణలు ప్రత్యారోపణలు ఎక్కువ. తాజాగా ఏపీలో ఇరిగేషన్ మంత్రి అనిల్ మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో మెజారిటీ పనులు జరగలేదని, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. లేనిపక్షంలో దేవినేని ఉమ మీసం తీసేస్తారా…? అవసరమైతే నాయి బ్రహ్మణున్ని నేనే ఇంటికి పంపుతా అంటూ సవాల్ విసిరారు.
కానీ ఏపిలో కులాల వారీగా రాజకీయలు ఎక్కువగా ఉంటాయి. పైగా బీసీల ద్వారా వైసీపీ మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నాయి బ్రహ్మణ వర్గం కూడా బీసీ వర్గంలో భాగంగా ఉన్నారు. కానీ మంత్రి అనిల్ నాయి బ్రహ్మణున్ని ఇంటికి పంపుతానటంపై ప్రతిపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకుంటుండటంతో మంత్రి దిగిరాక తప్పలేదు. నాయి బ్రహ్మణుల్ని కించపర్చే ఉద్దేశం తమది కాదని, తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.