ఎంపీ రఘురామకృష్ణంరాజు పై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆయన రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే వెళ్లనివ్వండని, ఆయన రాజీనామాతో పార్టీకి ఏం సంబంధం, అదేమైనా రెఫరెండమా అని ప్రశ్నించారు. అంతర్వేది ఘటనను ప్రభుత్వం సీరియస్ తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మతాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని, ఓ జాతీయ పార్టీ ఇప్పుడు ధర్నాలు చేస్తోందని, రాజకీయ పార్టీగా నిరసన తెలపాలే తప్ప విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నారు.
ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి విసిరిన సవాల్ కు ఇప్పటికే ఎంపీ స్పందించారు. అమరావతిని రాజధాని అనే రెఫరెండంగా భావిస్తే, అలా అని సీఎం జగన్ రాసిస్తే… నేను రాజీనామా చేస్తానని, ఉప ఎన్నికలకు వెళ్ధాం అంటూ ప్రకటించారు.