ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు భయాన్ని బాధను కలిగించిన ఏపీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం సంతోషాన్ని కల్గించింది. తాను విలీనం చేసేప్రసక్తే లేదు అని చెప్తు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లొ కుడా విలీనం అవ్వదు అని జోస్యం చెప్పారు సీఎం కేసీఆర్. తెలంగాణ సీఎం వ్యాఖ్యలు ఏపీ కార్మికుల నెత్తిన పాలు పోసినట్లుగా అయ్యింది. కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ సీరియస్ అయ్యారట, మనము చేస్తాము అని చెప్తుంటే వాళ్ళు కూడా చేయలేరు అని ఎలా అంటారు అని మంత్రుల ముందు సీరియస్ అయ్యారని సమాచారం, తన రాష్ట్రంలో సాధ్యం అవుతుందో కాదో చెప్పాలి గాని మన రాష్ట్రం గురించి ఎందుకు అని ప్రశ్నించారట. కేసీఆర్ సాధ్యం కాదు అన్నారు కాబట్టి మనం చెప్పిన సమయం కంటే ముందే విలీన ప్రక్రియ పూర్తిచేయాలి అని అదేశించారట.
ఏపీ మంత్రులు భహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఏం జరుగుతుందో ఆరు నెలల్లో చూద్దాం అని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తమ ప్రభుత్వంలో కసి పెరిగిందన్నారు మంత్రి పేర్ని నాని. వ్యవస్థలన్నీ ప్రయివేటుపరమవుతున్న పరిస్థితుల్లో ఏపీలో ఒక కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడమనేది చాలా గొప్ప నిర్ణయం. కచ్చితంగా దాన్ని అమలు చేసి చూపిస్తాం అన్నాడు.
సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తమలో కసి పెంచాయన్నారు. కేసీఆర్ మాటను మేం పాజిటివ్‌గా తీసుకున్నామన్నారు. మరో మూడు మాసాల్లోనో, ఆరు మాసాల్లోనో కేసీఆర్ జోష్యం తప్పని నిరూపిస్తామన్నారు మంత్రి పేర్ని.