తొలివెలుగు ఎక్స్‌క్లూజివ్:
ఏపీ నుండి కియా వెళ్లిపోతుందన్న వార్త నిజమేనా…? అలాంటిదేమీ లేదని ఏపీ సర్కార్ చెబుతున్నా… కియా ఎందుకు ఎందుకు స్పందించలేదు…? కియాను ఒప్పించేందుకే ఏపీ మంత్రి కోరియా వెళ్తున్నారా…?
ఏపీ నుండి కియా కార్ల పరిశ్రమ తరలిపోతుందన్న వార్త ఏపీలో సంచలనం సృష్టించింది. ప్రఖ్యాత అంతర్జాతీయ వార్త సంస్థ రాయిటర్స్ ఈ వార్తను ప్రచురించటంతో… జగన్ సర్కార్‌పై ఏపీలో తీవ్ర అసహనం వ్యక్తమయ్యింది. గతంలో బొత్స సత్యనారాయణ కారణంగా… వోక్స్‌వాగన్ సంస్థ వెళ్లిపోయిందని, ఇప్పుడు సీఎం చంద్రబాబు తెచ్చిన కియా వెళ్లిపోయేలా చేశారని రాజకీయ వర్గాల నుండి విమర్శలు వ్యక్తమయ్యాయి.
దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఏపీ సర్కార్… అలాంటిదేమీ లేదని, కియా ఎక్కడికి వెళ్లిపోవటం లేదని చెప్పే ప్రయత్నం చేసింది. మంత్రులంతా ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వచ్చారు. కానీ కియా సంస్థ తరపున మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవటంతో… కియా ఉంటుందా, వెళ్లిపోతుందా అన్న చర్చ అలాగే ఉంది.
అయితే… ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం అంటూ ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కొరియా టూర్ వెళ్లనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలివెలుగుకు అందుతున్న సమచారం ప్రకారం… కొరియా ఇన్వెస్ట్‌మెంట్ టూర్‌లో కియా సంస్థ యాజమాన్యంతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. కియా పరిశ్రమను వెళ్లిపోకుండా ఒప్పించేందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 16 నుండి రెండు రోజుల పాటు మంత్రి మేకపాటి కొరియాలో పర్యటించబోతున్నారు.
ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై తీవ్ర అసంతృప్తి జ్వాలలు వ్యక్తమవుతున్న సందర్భంలో… కియా పరిశ్రమ వెళ్లిపోతే ఏపీ మొత్తం ప్రభావం చూపుతుందని, రాజకీయంగా వైసీపీకి ఎంతో నష్టమని వైసీపీ ఉలిక్కిపడుతోంది. అయితే… ఇప్పటికే తమిళ్‌నాడుకు తరలించేందుకు సర్వం రెడీ అవుతుందన్న వార్తల నేపథ్యంలో… మేకపాటి రాయభారం వర్కవుట్ అయితుందో లేదో చూడాలి.
Also Read:
అమలుకాని చట్టానికి హడావిడి ఎందుకో…?
టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..?
Advertisements
పవన్ ట్యాటూ వెనుక రహస్యం ఏంటో ?