లోక్‌సభ నియోజకవర్గాల వారీగానే కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనలు చేసింది. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అరకు లోక్‌సభ నియోజకర్గంలో మాత్రం పాడేరు, పార్వతీపురం కేంద్రంగా వేర్వేరురుగా కొత్త జిల్లాల ప్రతిపాదించింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా 38 రెవెన్యూ డివిజన్లలో మార్పుచేర్పులు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతమున్న మూడు రెవెన్యూ డివిజన్లను రద్దు చేయాల్సి ఉంటుందని.. అలాగే కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అవసరమవుతుందని పేర్కొంది.
ప్రతి జిల్లాలో 2-3 డివిజన్లు ప్రతిపాదించింది అధికారుల కమిటీ. విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ డివిజన్లను మార్పులు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి తెలిపింది. మరోవైపు విస్తీర్ణం, జనాభా, చారిత్రక ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని ఈ సూచనలు చేసినట్టు వెల్లడించింది.