ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6కి చేరింది. తాజాగా నమోదైన కేసులు అనంతపురంలో ఒకటి, ప్రకాశం జిల్లాలో మరొకటి బయటపడ్డాయి. అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అటు ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి బ్రిటన్ నుంచి వచ్చాడు. వారిద్దరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలడంతో వారి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్ కు పంపించారు ఫలితాల్లో వారు ఒమిక్రాన్ భారిన పడినట్టు తేలింది.
ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు. తాజాగా నమోదైన కేసులుతో మొత్తం ఈ మహమ్మారి బాధితుల సంఖ్య 6 చేయండి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మాస్కులు వాడకం, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని సూచిస్తోంది. దేశంలో మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే