విజయవాడ పడమటలో బెంగాలీ వలస కార్మికుల పై పోలీసులు లాఠీచార్జి చేశారు.లాక్ డౌన్ కారణంగా ఆహారం అందక అల్లాడుతున్న వలస కూలీలు అల్లాడిపోతున్నారు . దీంతో దిక్కులేక ఆందోళనకు దిగారు . ఇంటికి పంపించమని వేడుకున్నారు . వీరు చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు పోలీసుల సమక్షంలో స్థానిక వైసీపీ కార్యకర్తలు వలసకూలీల పై దాడి చేసినట్లు తెలుస్తోంది . బెంగాలీ వలసకూలీ కి తలకు తీవ్ర గాయమైంది .
వలస కూలీలను స్వగ్రామాలకు పంపుతామని హామీ ఇచ్చి ప్రభుత్వం, అధికార యంత్రాంగం మాట తప్పాయని సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు . వలస కూలీల ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు,సిపిఎం నేత సిహెచ్ బాబూరావు తదితరులు మద్దతు తెలిపారు . వలసకూలీలపై లాఠీచార్జి సిపిఎం నేతలు ఖండించారు సిపిఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు . బాబురావు అరెస్టుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు .దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండించింది లాఠీచార్జి చేసిన పోలీసులు పైన, దాడి చేసిన వైసీపీ కార్యకర్తల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ సిపిఎం డిమాండ్ చేస్తోంది .