ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీల పెంపుదలను నిరసిస్తూ వామపక్షాలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి .చాలా చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి . అదే సమయంలో ప్రధాన నేతలు ఎవరిని ఇళ్ల నుండి బయటకు రాకుండా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. బయటకొచ్చిన నేతలను కూడా అక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. ఎంబి భవన్ వద్ద సిపిఐ రామకృష్ణ ను అరెస్ట్ చేశారు . ఆయనతో పాటు ఉన్న మరికొందరు వామపక్ష నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అరెస్ట్ పై సిపిఐ రామకృష్ణ స్పందించారు. విద్యుత్ చార్జీలు పెంచబోనని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కరోనా కష్ట కాలంలో ప్రజలు పెరిగిన చార్జీలు ఎలా కడతారని ప్రశ్నించారు .