ఒక హోండా సిటీ కారు యమ స్పీడుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తోంది. సరిగ్గా ఏపీ బోర్డర్ లోకి రాగానే కారు ఆపేశారు. కారులోని వ్యక్తి ‘‘సార్ మేం గవర్నమెంట్ సర్వెంట్స్ సార్.. కరోనా పాస్ కూడా ఉంది అన్నాడు.’’ అవతల పోలీసు అవేమీ పట్టించుకోవడం లేదు.. కారు నెంబర్ ని ఎగాదిగా చూస్తున్నాడు. ‘‘సార్ సీబుక్ ఉంది.. నాకు లైసెన్స్ కూడా ఉంది.. కారుకు ఇన్సూరెన్స్ కూడా ఉంది..’’ పాపం మంచి బాలుడిలా అన్నీ చెప్పాడు. అన్నీ విన్నాక ఆ పోలీసు ‘‘ అవన్నీ ఎవడిక్కావాలి.. ముందు డిక్కీ ఓపెన్ చేయండి‘‘ అన్నాడు. డిక్కీ ఓపెన్ చేయించి.. కారు వెనక సీట్లో కూడా చెక్ చేసి పొమ్మన్నాడు. అయోమయంగా చూస్తున్న వ్యక్తి వంక చూసి పోలీసు నవ్వి ‘‘మందు బాటిల్స్ ఏమైనా తెస్తున్నారా అని చెకింగ్ అంతే.. కరోనా భరోనా ఏమీ లేదు’’ అన్నాడు. అప్పుడర్ధమైంది అసలు సంగతి.
తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉన్న కృష్ణాజిల్లా పోలీసులకు, కర్నాటక సరిహద్దులో ఉన్నఅనంతపురం జిల్లా పోలీసులకు.. తమిళనాడు సరిహద్దులో ఉన్నచిత్తూరు, నెల్లూరు జిల్లాల పోలీసులకు ఇదే పని ఇప్పుడు. ఏ వెహికల్స్ వస్తున్నాయి.. వాటిలో మందు బాటిళ్లు ఉన్నాయా లేవా.. అదే చెకింగ్.. ఓ సినిమాలో ఆలీ ఇసుక చూపించి.. బళ్లు ఎత్తికెళ్లినట్లే ఉంది ఈ తంతు. దొంగ కార్లు పోయినా.. ఇంకేమన్నా జరిగినా పట్టించుకునేట్లు లేరు.. మన పోలీసులు.. ఓన్లీ మందు బాటిళ్లు ఉన్నాయా లేవా.. అదొక్కటే టార్గెట్.
సన్నీలియోన్ పెళ్లి కుర్రకారు చావుకొచ్చిందని.. జగనన్న మద్యం పాలసీ ఎక్సైజ్ పోలీసుల చావుకొచ్చింది. మద్య నిషేధం అంటూ.. ప్రభుత్వమే మద్యం షాపులు తెరిస్తే ఏంటో అనుకున్నారంతా. అదేంటో ఇప్పుడే క్లారిటీగా అందరికీ అర్ధమవుతోంది. ఇప్పుడు రాష్ట్రం సరిహద్దుల్లో ఎక్సైజ్ పోలీసులకు, పోలీసులకు ఒకటే పని.. అదేంటంటే అక్రమ మద్యం రవాణాను అరికట్టడం. ఈ అక్రమ మద్యం అంటే ఏంటో అనుకునేరు.. రెగ్యులర్ బ్రాండ్స్.. తెలంగాణలో దొరుకుతాయి.. కర్నాటక, తమిళనాడులోనూ దొరుకుతాయి.. ఒక్క ఏపీలో తప్ప. ఇక్కడ అన్నీ అమ్మా బాబు అడ్రస్ లేని బ్రాండ్లే దొరుకుతాయి. అందుకని రెగ్యులర్ బ్రాండ్స్ దాగే సర్కిల్స్ అందరూ.. వాటి కోసం తెగ తాపత్రయపడుతున్నారు. వారి కోసం కొందరు నడుం బిగించి.. ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్నారు.. వాటిని పట్టుకుని అక్రమ మద్యం కేసులను పెడుతున్నారు మనోళ్లు.
జగన్ సాబ్.. చాలా తెలివిగా.. తమ పార్టీ వారితోనే కొత్త బ్రాండ్లు తెప్పించి.. వాటిని మాత్రమే అమ్మేలా.. వాటిని మాత్రమే జనం కొనేలా ఏర్పాటు చేసేశారు. పైగా మళ్లీ ఇతర రాష్ట్రాల నుంచి వేరే బ్రాండ్లు మద్యం వస్తే… ఇవెవరు కొంటారు.. అందుకే స్ట్రిక్ట్ ఆర్డర్స్. పోలీసులకు, ఎక్సైజ్ పోలీసులకు ఇదే పని.. ఎక్కడ ఒక్క బాటిల్ కనపడినా సరే లాగేసుకోమని చెప్పేస్తున్నారు. అలా అయితేనే కదా.. చచ్చినట్లు వీళ్ల బ్రాండ్లు కొనేది మందుబాబులు. మరి ఈ తంతు ఎన్నాళ్లు నడుస్తుందో.. మందుబాబులు ఎన్నాళ్లు.. వీటిని భరిస్తారో.. పోనీ విరక్తి పుట్టి అసలు మందే మానేస్తే ఇంకా మంచిది.