బంగాళాఖాతంలోని విశాఖ తీరాన్ని ఆనుకుని రాజకీయ ఇసుక తుపాను రేగుతోంది. విశాఖ సాగర తీరం వెంబడి సాధారణంగా అల్పపీడనాలు, తుపాను లు ఏర్పడటం సహజమే. కానీ ఈసారి మాత్రం విశాఖ తీరంలో ఇసుక తుపాను అలజడి సృష్టిస్తోంది. సహజంగా ప్రకృతి విపత్తుల కారణంగా తుపాను ఏర్పడుతుంటాయి.. కానీ ఈ ఇసుక తుపాను మాత్రం రాజకీయ పార్టీలు రగిలిస్తున్నాయి. ఇసక కొరత నెలకొన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు దానిపైనే ఫోకస్ పెట్టాయి. ఇసుక లేక ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు మేమంటే మేము అండగా ఉంటామంటూ అధికార వైసీపీ పార్టీ లభ్యంగా రాజకీయ తుపాను రేపుతున్నారు. ఇంతకీ ఇసుక పోరాటం కోసం రాజకీయ పార్టీలు పడుతున్న ఆరాటం వెనుక ఏముంది.. వాచ్ ద స్టోరి
వాయిస్ ఓవర్ – రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరత కాస్తా ఇసుకను బంగారం కంటే విలువైనదిగా మారిపోయింది. బంగారం కావాలంటే గోల్డ్ షాపునుకు వెళ్లి ఎవరికి ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు. కానీ ఇసుక కావాలంటే ఎక్కడా దొరకడం లేదు. ఎంత డబ్బు పెట్టినా సరే అనుకున్న సమయానికి కావాల్సినంత దొరకడం లేదని అటు భవన నిర్మాణదారు, అటు కార్మికులు కూడా గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆహారం, త్రాగునీరు, సాగునీరు వంటి సమస్యలు ఉన్నా సరే వాటికి మించిన అత్యంత విలువైన సమస్యగా ఇసుక కొరత మారిపోయింది. గత నాలుగు నెలలుగా ఇసుక లేక చాలా నిర్మాణాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖలో లెక్కలేనన్ని నిర్మాణాలు నిత్యం సాగుతూనే ఉంటాయి. ఈ నిర్మాణాల్లో పని చేసే కార్మికులు కూడా పని లేక అల్లాడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. ఇసుక సమస్యను తీర్చండి మహా ప్రభో అని రోడ్డున పడ్డారు. నెలలు గడుస్తున్నా సరే పరిష్కారం మాత్రం లభించలేదు.
వాయిస్ ఓవర్ – భవన నిర్మాణదారులైన బిల్డర్స్ చాలా మందికి రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉంటోంది. ఇసుక అందుబాటులో లేక సమస్యను ఎప్పుడైతో ఎదుర్కొంటున్నారో అది రాజకీయ సమస్యగా మారిపోయంది. ఇసుక లేకపోవడం అధికార వైసీపీ వైఫల్యమంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది. సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వం కూడా ఇసుక పాలసీలో సంస్కరణలు తీసుకురావాలని భావించడంతో జగన్ కీలక నిర్ణయం తీసుకుని పరిష్కరిస్తారని అంతా ఆశించారు. అయితే నెలలు గడుస్తున్నా సరే సమస్య పరిష్కారం కాకపోయే సరికి ఇసుక రాజకీయ అస్త్రంగా మారింది. ఇసుక కొరతను తీర్చాలంటూ తొలుత వామపక్షాలు రంగంలోకి దిగాయి. సీపీఐ, సీపీఎం పార్టీలకు అనుబంధంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులతో కలసి చిన్న చిన్న స్థాయిలో ధర్నాలు చేయడం ప్రారంభించింది. అయితే రోజులు గడుస్తున్నా సరే సమస్య పరిష్కారం కాకపోవడం, కార్మికుల్లో ఆగ్రహం పెరుగుతుండటాన్ని తెలుగుదేశం పార్టీ కూడా గ్రహించింది. దీంతో ఆ పార్టీ కూడా ఇసుక కొరతపై అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో ఇసుక కొరతపై ఉద్యమిస్తున్నట్లుగా టీడీపీ కలరింగ్ ఇచ్చింది.
వాయిస్ ఓవర్ – భవన నిర్మాణ కార్మికులందరూ మన అనుబంధ సంఘాల్లో ఉండి తెలుగుదేశం పార్టీకి ఉద్యమ క్రెడిట్ దక్కడమేమిటంటూ వామపక్ష పార్టీలు ఆలోచనలో పడ్డాయి. అప్పటివరకు సీపీఐ, సీపీఎం వేర్వేరుగా ఇసుకపై చేసే ఉద్యమాలను వీడి ఉమ్మడి ఉద్యమం చేసాయి. అన్ని ప్రాంతాల్లో కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టడం ప్రారంభించాయి. దీంతో అటు టీడీపీ, ఇటు లెఫ్ట్ పార్టీలు కూడా ఇసుక కొరతపై ఆందోళన చేయడంతో అధికార వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవడం ప్రారంభమైంది. దీంతో భవన నిర్మాణాలు ఎక్కుగా జరిగే విశాఖలో ఇసుక రీచ్ లు ఏర్పాటు చేయడం, ఆన్ లైన్ లో కేటాయించడం, వంటి పనిని మంత్రి అవంతి శ్రీనివాసరావు చేపట్టారు. ఆయన చెప్పినట్లుగా ఆన్ లైన్ లో పెడుతున్నా సరే సామాన్యులకు అందుబాటులోకి రావడం సాధ్యం కాలేదు.
వాయిస్ ఓవర్ – ఇదే సమయంలో అమరావతికి వచ్చి సమీక్షలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యను చెప్పుకున్నారు. దీంతో పార్టీలో కొందరు ముఖ్యలతో చేర్చించిన తర్వాత ఇసుకపై ఏకంగా ఉద్యమం చేయాలని పవన్ నిర్ణయించారు. అంతేకాదు విశాఖలోనే లాంగ్ మార్చ్ పేరిట ఉద్యమం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. దీంతో రాజీయ పార్టీల్లో అలజడి మొదలైంది. ఇసుక ఉద్యమ క్రెడిట్ మొత్తం పవన్ కే వెళ్లేలా ఉందే అనే ఆలోచనలో పడ్డారు. దీంతో తెలుగుదేశం పార్టీ వెంటనే తేరుకుని ఈ నెల 25న ఆన్ని జిల్లాల్లోని ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం శ్రేణులన్నీ అత్యంత ఉత్సాహంతో ఈ నిరాహార దీక్షలను విజయవంతం చేసాయి. అంటే ఇసుక సమస్యపై టీడీపీ రెండు దఫాలుగాఉద్యమం చేసినట్లు క్రెడిట్ దక్కించుకుంది.
వాయిస్ ఓవర్ – తెలుగుదేశం పార్టీ ఇసుక సమస్యపై నిరాహార దీక్ష చేసిన తర్వాత జనసేనలో అలజడి మొదలైంది. సమస్య ఉన్పప్పుడే అందుకుని దానిని అస్త్రంగా చేసుకుని ఉద్యమించాలని తప్పితే లాంగ్ గ్యాప్ ఇచ్చి లాంగ్ మార్చ్ చేస్తేఏమి ప్రయోజనమని కొందరు జనసైనికులు ఆవేదన చెందుతున్నారు. పిలుపునిచ్చిన పక్షం రోజుల తర్వాత లాంగ్ మార్చ్ చేస్తే ప్రజల్లోకి ఎలా వెళుతుందన్నది వారి ఆలోచన. ఇప్పటికే టీడీపీ ఇసుక ఉద్యమంపై అధికార పార్టీని రోజూ వివిధ రూపాల్లో కార్నర్ చేస్తూ ఇరకాటంలో పెడుతోంది. ఇది ప్రజల్లోకి, కార్మికుల్లోకి బలంగా వెళ్లిందని, ఎప్పుడో నవంబర్ లో కొన్ని నిమిషాల కాలం పాటు లాంగ్ మార్చ్ చేస్తే సమస్యై పోరాడి సాధించేది ఏముటుందని మధన పడుతున్నారు. వామపక్షాలకు అనుబంధ సంఘాల ఉండటంతో వారి బలం వారికి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఇసుకనే ఆధారంగా చేసుకుని అధికార పార్టీపై విరుచుకుపడుతుందని, జనసేన ఏం చేస్తుందంటే ఏం చెప్పాలని శ్రేణుల్లో అంతర్మధనం సాగుతోంది.
వాయిస్ ఓవర్ – ఇసుకపై విపక్షరాజకీయ పార్టీలన్నీ ఏకమై అధికార పార్టీ వైపు అస్ర్తాలను ఎక్కుపెడుతూనే, తమకు ఈ వ్యవహారంలో ఎంత క్రెడిట్ వస్తుందనే లెక్కలు కూడా వేసుకుంటున్నాయి. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉండటంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో వీరి వల్ల ఎంతొకొంత బలం చేకూరుతుందని ఆశిస్తున్నారు. దీంతో ఇసుకపై రాజకీయ ఉద్యమ ప్రయోజనం తమకంటే తమకే రావాలని అన్ని పార్టీలు పోటాపోటీగా ఆందోళనలకు రూపకల్పన చేస్తున్నాయి. మరోవైపు ఇసుక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే తమకు అనుకూలంగా మారి ఆ వర్గమంతా కలిసివచ్చేలా చేసుకోవాలని వైసీపీ కూడా వ్యూహాత్మకంగా పావలు కదుపుతోంది. ప్రస్తుతానికి వరదల రావడంతో ఇసుక సమస్య ఉందని కాలం నెట్టుకొస్తున్నా సరే రేపో , మాపో వైసీపీకూడా సరైన పరిష్కారాన్ని చూపాల్సి ఉంటుంది.
ఎండ్ వాయిస్ – మొత్తానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉన్నప్పటికీ వాటి మాటునే రాజకీయ పడగను కూా విపుతున్నారు. ఇసుక బంగారమాయే అని ప్రజలు భావిస్తుంటే పొలిటికల్ ప్రాఫిట్ కోసం పోరాటాల పేరిట సాగుతున్న రాజకీయ పార్టీల ఆరాటాలను కూడా భవన నిర్మాణ కార్మికులు, ప్రజలకు కూడా గమనిస్తున్నారు. ఫైనల్ గా ఇసుక క్రెడిట్ ఎవరికి దక్కుతుందో తెలియాలంటే స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆగాల్సిందే..