సాక్షిలో పనిచేసే వారందరికీ కొలువుల్లో కూర్చోబెడుతూ సచివాలయాన్ని సాక్షి బ్రాంచ్ ఆఫీసుగా మార్చేస్తున్నారని ప్రతిపక్షం చేస్తున్న విమర్శల్ని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సాక్షి కుటుంబానికి పదవుల పందేరం కొనసాగుతోంది. సాక్షిలో పొలిటికల్ సెల్ సలహాదారుగా పనిచేసిన జర్నలిస్ట్ శ్రీనాథరెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గిరీ కట్టబెట్టినట్టు వార్తలొచ్చాయి.
గుంటూరు: సీనియర్ జర్నలిస్టు, కడప జిల్లాకు చెందిన దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు రావాల్సివుంది. శ్రీనాథ్‌రెడ్డి సుదీర్ఘ కాలం 28 సంవత్సరాల పాటు ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సీనియర్ జర్నలిస్టుగా పని చేశారు. 2014 నుంచి సాక్షి పొలిటికల్ సెల్‌కు సలహాదారులుగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీయుడబ్ల్యుజేలో వివిధ హోదాల్లో వున్నారు. రాయలసీమ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ మంత్రులు ఎంవీ మైసూరారెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డితో కలసి రాయలసీమ సమస్యలపై శ్రీనాథ్‌రెడ్డి ఉద్యమించారు. శ్రీనాథ్‌రెడ్డి సొంత ఊరు పులివెందుల మండలం కోరగుంటపల్లె గ్రామం.
సాక్షి కుటుంబానికే చెందిన మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ప్రెస్ అకాడమీ పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు. ఐతే, ఆయన ఆ పదవి తీసుకోడానికి నిరాకరించినట్టుగా తొలివెలుగు ఇంతకుముందే సమాచారం అందించింది.