ఆంధ్రప్రదేశ్‌పై కరోనా దాడి మరింత ఉధృతమైంది. రోజు రోజుకి వంద, రెండు వందలు అత్యధికమవుతూ అంతకంత కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా టెస్టులు పెరగకపోయినా.. పాజిటివ్ కేసులు మాత్రం భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 31,072 మందికి పరీక్షలు నిర్వహించగా.. 1,730 మందిలో పాజిటివ్ తేలింది. తాజా కేసుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 378, చిత్తూరులో 338, విశాఖ జిల్లాలో 235, కృష్ణా జిల్లా 226 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,07,676కి పెరిగింది.
కరోనా కారణంగా తాజగా ఏపీలో ఐదుగురు మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బారికి బలైనవారి సంఖ్య 7,239కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,300 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఏపీలో ఇప్పటివరకు 1,52,08,436 కరోనా టెస్టులు నిర్వహించినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.