ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 121 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదయిన వాటితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య 8,85,037కు చేరాయి.
మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 7,131మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 2,450 యాక్టివ్ కేసులుండగా కరోనా నుంచి కోలుకుని 8,75,456 మంది రికవరీ అయ్యారు. కొత్తగా కృష్ణా, విశాఖ జిల్లాల్లో కరోనాతో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.