ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,363 శాంపిల్స్ పరీక్షించగా… 1,361 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో 15 మంది కరోనా తో మృతిచెందారు. ఇక మరోవైపు గడిచిన 24 గంటల్లో 1,288 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,24,603కు చేరింది. అలాగే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,96,143కు చేరింది.
ఇక, కరోనాబారినపడి ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 13,950 గా ఉండగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,510 యాక్టివ్ కేసులు ఉన్నాయి.