ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,856 శాంపిల్స్ పరీక్షించగా.. 1,439 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 14 మంది మృతిచెందారు. ఇక కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మృతి చెందారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 1,311 మంది కొలుకున్నారు.
ఇక మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,26,042కు చేరింది. అలాగే రికవరీ కేసులు 19,97,454కు పెరిగింది. ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 13,964కు పెరిగింది.అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 14,624 యాక్టివ్ కేసులు ఉన్నాయి.