ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గిన సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో మొత్తం 349 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం ఇప్పటివరకు నమోదు అయిన కేసుల సంఖ్య 8,81,948 కి చేరుకుంది. అయితే ఇప్పటివరకు అందులో 8,71,588 మంది సంపూర్ణ ఆరోగ్యం తో ఇంటికి చేరుకున్నారు.
ప్రస్తుతం 3256 కరోనా తో చికిత్స పొందుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో నలుగురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 7104కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 472 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.