ఏపీలో లో గడచిన 24 గంటల్లో 357 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 59,551 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు నమోదయ్యాయి. మరోవైపు గడచిన 24 గంటల్లో 355 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో నలుగురు ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 8,80,075 కి చేరింది. ఇక 8.69 లక్షల మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 3862 కి చేరింది. అదేవిధంగా మృతుల సంఖ్య 7089 చేరింది.