ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు భారీగా దిగొచ్చాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 128 మందికి మాత్రమే పాజిటివ్ నిర్దారణ అయింది. అయితే టెస్టులు తగ్గడం వల్లే పాజిటివ్ కేసులు తగ్గినట్టుగా అర్థమవుతోంది. రోజూ 40 వేలకు పైనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం .. నిన్న 29 వేల 714 మాత్రమే చేసింది. దీంతోనే పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. మరోవైపు కరోనాతో చికిత్ప పొందుతూ రాష్ట్రంలో నిన్న మరో ముగ్గురు మృతి చెందారు.
ఏపీలో కరోనా వైరస్ తాజా గణాంకాలను పరిశీలిస్తే..
ఇప్పటివరకూ నమోదైన కేసులు – 8,83,210
కోలుకున్నవారు– 8,73,149
యాక్టివ్ కేసులు– 2,943
కరోనాతో మరణించిన వారు– 7,118
మొత్తం కరోనా టెస్టులు-1.20 కోట్లు