ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన పన్నెండు గంటల్లో కొత్తగా మరో 16 కేసులు నమోదు కావటం ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో 1080 మంది ఏపీ వారున్నారని, ఇందులో కొందరు ఇతర రాష్ట్రాల్లో ఉండగా… ఏపీలో ఉన్నవారిని, వారి సన్నిహితులకు పరీక్షలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
శుక్రవారం రాత్రి 10.30గంటల నుండి ఈ రోజు ఉదయం వరకు చేసిన టెస్టుల్లో 16 పాజిటివ్ కేసలు వచ్చాయి. ఇందులో కృష్ణా, కడప జిల్లాల్లో 4 కేసులు, గుంటూరు, కర్నూల్ లో 3 కేసులు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది.
ఇప్పటికీ ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారికి పరీక్షలు కొనసాగుతుండగా, వారు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారు అన్న చైన్ ను ఏపీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే… ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఏమాత్రం అనుమానం ఉన్నా, ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని కలిశాం అన్న అనుమానం ఉన్నా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఏపీ సర్కార్ కోరింది.