ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 40,177 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 232 మందికి పాజిటివ్ తేలింది. కరోనాకు చికిత్స పొందుతూ రాష్ట్రంలో నిన్న నలుగురు మృతి చెందారు. ఇక ఈ మహమ్మారి నుంచి నిన్న 352 మంది కోలుకున్నారు.
ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 83 వేల 82 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 7,115 మంది చికిత్ప పొందుతూ ప్రాణాలు కోల్పయారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 8 లక్షల 72 వేల 897 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల 70 యాక్టివ్ కేసులు ఉన్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఏపీలో ఇప్పటి వరకు ఒక కోటీ 19 లక్షల 72 వేలకు పైగా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.