ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ అదుపులోనే ఉంది. చాలా రోజులుగా 100లోపే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 54 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. నిన్న కొత్తగా మరణాలేం నమోదు కాలేదు. ఇక తాజాగా 70 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.
ఇప్పటివరకు ఏపీలో నమోదైన కేసులు: 8,89,210
కోలుకున్నవారు 8,81,439
యాక్టివ్ కేసులు: 604
మరణాలు: 7,167