ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఇటీవల ప్రతి రోజూ భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా అదే పరంపర కొనసాగింది. తాజాగా ఏపీలో మరో 7822 కేసులు నమోదయ్యాయి. మరో 63 మంది మృతి చెందారు. ఇందులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,113 కేసులు, విశాఖ 1,049 కేసులు బయటపడ్డాయి.
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్షా 66 వేల 586కు చేరింది. అలాగే కరోనా మరణాలు 1,500 దాటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1537కు పెరిగింది.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 76 వేల 377 మంది చికిత్స పొందుతుండగా…. 88 వేల 672 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇక మరణాల విషయానికి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మంది, విశాఖపట్నం- 9, ప్రకాశం- 8, నెల్లూరు- 7, శ్రీకాకుళం – 7 , విజయనగరం -4 చిత్తూరు -3, కృష్ణా -3 కర్నూలు -3 , అనంతపురం,తూర్పు గోదావరి, గుంటూరు, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.