ఏపీలో ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 64,147 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 9,747 కేసులు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు మహమ్మారి బారిన పడిన 67 మంది మృతిచెందారు. దీంతో.. ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 176333కు చేసుకుంది. ఇప్పటివరకు 95625 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 79104 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటి వరకు 1604 మందిని కరోనా బలితీసుకుంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12, కృష్ణా జిల్లాలో 9, కర్నూలు జిల్లాలో 8, తూర్పు గోదావరి ,చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో ఏడుగురు అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, విశాఖలో రెండు, విజయనగరం-పశ్చిమ గోదావరి-ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.