ఏపీలో మరోసారి కేసుల సంఖ్య భారీగా పెరిగింది. తాజాగా గత 24గంటల్లో మరో 62 కొత్త కేసులు వచ్చాయి. తాజాగా ఒకరు మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2514కు చేరగా, 55 మంది మరణించారు.
ఏపీలో ఇప్పటి వరకు 1731మంది కోలుకోగా… గత 24గంటల్లో 51మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరణించిన వ్యక్తి కృష్ణా జిల్లా వాసిగా ఏపీ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో 728మంది చికిత్స పొందుతున్నారు.
ఇక తాజాగా నమోదైన 62 కేసుల్లోనూ 18 కేసులు తమిళనాడు కోయంబేడు మార్కెట్ తో లింకున్న కేసులేనని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కొంతకాలంగా ప్రతి రోజు కోయంబేడు మార్కెట్ లింక్ కేసులు ఏపీలో నమోదవుతూనే ఉన్నాయి.