ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 26 వేల మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా… 74 మందికి పాజిటివ్ అని తేలింది. తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా బాధితులు సంఖ్య 8,90,766కు పెరిగింది. ఇక కరోనాకు చికిత్స పొందుతూ తాజాగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7176కి పెరిగింది. తాజాగా ఈ మహమ్మారి బారి నుంచి ఏపీలో 61 మంది కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం1009 యాక్టివ్ కేసులు మిగిలిపోయాయి.
వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..