ఇటుక బట్టీల్లో కట్టు బానిసలుగా పనిచేస్తున్న 32 మంది కార్మికులను ఏపీ అధికారులు రక్షించారు. వారిలో 12 మంది మైనర్లు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలోని కనుంపల్లి క్రాస్ రోడ్ దగ్గర ఇసుక బట్టీల్లో 32 కార్మికుల చేత యాజమాన్యం కట్టు బానిసలుగా పనిచేయిస్తుంది. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, శిశు సంక్షేమ, కార్మిక శాఖ అధికారులు పోలీసుల సహాయంతో దాడులు నిర్వహించి వారిని కార్మికులను రక్షించారు. అనంతపురం కు చెందిన శేఖర్, నెల్లూరుకు చెందిన శ్రీనివాస్ ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. విముక్తులైన కార్మికులంతా ఒడిశాలోని బొలంగిర్ జిల్లా టురేకెలా బ్లాక్ కర్లుముడ గ్రామానికి చెందిన వారు. మహిళా కార్మికుల చేత ఎక్కువ పనిగంటలు పని చేయించడం, మైనర్ పిల్లలను పని చేయాలని యజమానులు కొ ట్టేవారని కార్మికులు తెలిపారు. తాగడానికి మంచి నీళ్లు ఇచ్చే వారు కాదని, భోజనం కోసం ఒక్కొక్కరికి వారానికి రెండు వందలు ఇచ్చి వారమంతా పనిచేయించుకునేవారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.