ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం,విజయవాడలో తన భాద్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్ నోటిఫికేషన్ మేరకు శుక్రవారమే హైదరాబాద్ లో బాధ్యతలు చేపట్టాను. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం కార్యదర్శి వాణి మోహన్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు సమాచారం అందించాను. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ద, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ.
రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది. తమ విధుల నిర్వహణలో ఎస్ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాను గతంలో లాగే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.