సీమెన్స్ కేసులో మాజీ ఐఏఎస్ రమేష్ కు ఉచ్చు బిగుసుకుంటున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన అధికారులు తాజాగా రమేష్ ను విచారించనున్నారు. విచారణ కోసం రమేష్ ఇంటి వెళ్లిన పోలీసులు..అక్కడ ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు.ఇంటిని డెవలప్ మెంట్ కోసం క్రాంటాక్టర్ కి ఇల్లును ఇచ్చి.. ఆయన వేరే ఇంట్లో ఉంటున్నట్టు అధికారులు తెలుసుకున్నారు. దీంతో రమేష్ కు స్పీడ్ పోస్ట్ లో ప్రశ్నలు పంపుతామని ఏపీ సీఐడీ తెలిపింది.రమేష్ దగ్గర కీలక సమాచారం దొరికే అవకాశం ఉందని సీఐడీ భావిస్తుంది.
స్కాం జరిగిన సమయంలో రమేష్ కుమార్ ఫైనాన్స్ సెక్రటరీగా పని చేశారు.ఆయన దగ్గర కీలక సమాచారం దొరికే అవకాశం ఉంది. 241 కోట్ల స్కాం లో విచారణను వేగవంతం చేస్తుంది.