ప్రత్యేక హోదా.. శివాజీపై బీజేపీ కార్యకర్తల దాడి

నటుడు శివాజీపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ‘టీవీ9’ విజయవాడలో చర్చ చేపట్టింది. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలు, ప్రజాసంక్షేమ సంఘాల నేతలు హాజరై తమతమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. హోదా కోసం నటుడు శివాజీ మాట్లాడుతుండగా చర్చలోకి చొరబడ్డారు బీజేపీ కార్యకర్తలు.
 

హోదా కోసం ప్రశ్నించడాన్ని భరించలేని ఆ పార్టీ కార్యకర్తలు, శివాజీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సంయమనం కోల్పోయి దాడికి యత్నించారు. అలాగే కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పద్మపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈలోగా ప్రజాసంఘాలు, ప్రజలు కార్యకర్తల దాడిని అడ్డుకున్నారు.