రాజధాని ఆందోళన సెగ టాలీవుడ్ కు తాకింది. రాజధాని తరలింపుపై టాలీవుడ్ స్పందించాలని.. లేదంటే విడుదలకు సిద్ధం అవుతున్న మూవీలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా జె ఎన్ యూ ఘటనపై అల్లు అర్జున్ స్పందిస్తూ.. విద్యార్థులపై దాడులకు పాల్పడటం సరైంది కాదని వ్యాఖ్యానించారు. దీంతో బన్ని తీరుపై ఏపీ విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. జె ఎన్ యూ విషయంపై మాట్లాడం సరే కానీ ఏపీ రాజధాని తరలింపును నిరసిస్తూ ఆందోళనలు చేపడుతుంటే బన్నీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే మహేష్ బాబు ఇంటి ఎదుట విద్యార్థి సంఘాల నేతలు దీక్షకు దిగారు. రాజధాని తరలింపుపై నోరు విప్పాలని లేదంటే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » బన్నీకి రాజధాని సెగ